: శ్రీవారి సమాచారం


అనంతపద్మనాభ స్వామి జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం జరిగింది. ఈ వేకువ జామున సుదర్శన చక్రత్తాళ్వార్ ను అర్చకులు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. తిరుమంజనం, అభిషేకం నిర్వహించి పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News