: సృజనకు మూలం ఇదే!


ఏ విషయాన్నైనా కొందరు కొత్తగా ఆలోచిస్తుంటారు. ఇది ఇలాగే ఎందుకుండాలి... మరోలా ఎందుకు ఉండకూడదు... అంటూ ప్రత్యేకంగా కొందరు ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి ఆలోచనల నుండే సరికొత్త వస్తువులు పుట్టుకొస్తుంటాయి. ఇదే సృజనాత్మకత. ఇది ఏ రంగంలోనైనా కొత్త వస్తువుల ఉత్పత్తికి దోహదపడుతుంది. అంతేకాదు... ఇలాంటి ఆలోచనలు వచ్చేవారే అన్ని రంగాల్లోను ఉన్నతస్థాయికి వెళుతుంటారు కూడా. అయితే ఇలా ప్రత్యేకంగా ఆలోచించడానికి అసలు మూలం ఎక్కడుంది... ఈ విషయం చాలాకాలంగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కని ప్రశ్న. ఇప్పుడు దీని అసలు రహస్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించేశారు. మెదడులోని ఒక ప్రత్యేక భాగం ఈ సృజనాత్మకతకు మూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఎద్దు ముఖంతో ఉన్న ఈగను ఊహించి గీయగలరా... కొందరు అదేలా గీయగలం? అంటారేమో కానీ, కొందరు అలాంటి ఈగను గీయగలరు. ఎందుకంటే, వారి మెదడు దాన్ని ఊహించే శక్తిని కలిగివుంటుంది. ఇలా కొందరి మెదడులో సృజనాత్మక ఆలోచనలు రావడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికాలోని డార్డ్‌మౌత్‌ కళాశాలకు చెందిన శాస్త్రవేత్తలు కొందరిపై ప్రత్యేక పరిశోధనలు చేసి సృజనాత్మకతలకు మూలాన్ని గుర్తించారు. వీరు 15 మందిపై జరిపిన పరిశోధనల్లో వారిని రకరకాల ప్రశ్నలు అడిగారు. ఉదాహరణకు ఎద్దుముఖంతో ఉన్న ఈగను ఊహించుకోమన్నారు. అలా వారి ఊహల్లో రూపాన్ని ఊహించుకునే సమయంలో వారి మెదడును ఎంఆర్‌ఐ స్కాన్‌ చేశారు. ఈ సమయంలో మెదడులో జరిగే మార్పుల్ని పరిశీలించారు. మెదడులోని కార్టికల్‌, సబ్‌కార్టికల్‌ భాగాలు సృజనాత్మక చిత్రం రూపొందడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనంలో తేల్చారు.

  • Loading...

More Telugu News