: ఇలా కూడా విద్యుదుత్పత్తి!


విద్యుత్తును ఎక్కడెక్కడి నుండి ఉత్పత్తి చేయవచ్చు అనే విషయానికొస్తే... చాలానే చెప్పవచ్చు. మనుషులు నడిచే ఫుట్‌పాత్‌లనుండి కూడా కరెంటును ఉత్పత్తి చేయవచ్చని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇప్పుడు మరో కొత్త మార్గం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పెరుగుతున్న మనుషులను అనుసరించి మురుగు నీరు కూడా పెరుగుతూ వస్తోంది. ఈ మురుగునీరు ఏరులై పారుతోంది. ఇలా వృధాగా పారే మురుగునీటిని శుద్ధి చేసి చెట్లకు వాడవచ్చని కొందరు చెబుతుంటారు. ఈ విషయం పక్కనబెడితే మురుగునీటి కాలువ నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్టాన్‌ఫోర్ట్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీర్లు మురికి కాలువలో ఉండే సహజమైన సూక్ష్మ క్రిములనుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే ఒక కొత్తరకం బ్యాటరీని అభివృద్ధి చేశారు. ఈ బ్యాటరీ ద్వారా మురుగులో ఉండే సూక్ష్మ క్రిముల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని, తమ బ్యాటరీని మురికినీటి శుద్ధీకరణ ప్లాంట్లు, మురికి కాలువల వద్ద వినియోగించవచ్చని చెబుతున్నారు. మొత్తానికి విద్యుత్తును ఏయే మార్గాల ద్వారా ఉత్పత్తి చేయవచ్చో పరిశోధించి వాటన్నింటినీ వదలకుండా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు.

  • Loading...

More Telugu News