: మేమూ చెప్పగలం గొప్పలు: రాహుల్ గాంధీ
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విపక్షాలపై ధ్వజమెత్తారు. చేసినవాటి గురించి గొప్పలు చెప్పుకోవడం తమకూ చేతనవుతుందని అన్నారు. రోడ్లు వేశామని, వంతెనలు కట్టామని, భవంతులు లేపామని కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయని, అయితే, తాము వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న నిరుపేదల గురించి మాట్లాడతామని స్పష్టం చేశారు. ఆ పేదల ప్రయోజనాలే తమకు ముఖ్యమని నొక్కిచెప్పారు. రాజస్థాన్ లోని బార్మర్ లో ఎన్నికల ప్రచార సభలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధినే చూస్తాయని, తాము నిరుపేద కలలను సాకారం చేయడమెలాగో ఆలోచిస్తామని తెలిపారు.