: కాంగ్రెస్ లోనే కొనసాగుతా: విజయశాంతి
టీఆర్ఎస్ లో సముచిత స్థానం లభించకపోవడంతో బయటికి వచ్చిన మెదక్ ఎంపీ విజయశాంతి చడీచప్పుడులేకుండా కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది. ఈ మాటలను నిజంచేస్తూ కాంగ్రెస్ లో కొనసాగుతానని ఆమే చెప్పారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన సోనియా ఓ దేవత అని కీర్తించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆగదని, పార్లమెంట్ లో బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందని పేర్కొన్నారు.