: ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు
గత కొద్ది రోజులుగా విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం రేపు జరగబోతోంది. దీనికోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లను చురుగ్గా చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ భారీ వినాయకుడిని తరలించడానికి అవసరమైన ట్రాలీని విజయవాడ నుంచి తెప్పించారు. నవరాత్రులకు నేడు చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.