: మరోసారి భత్కల్, అక్తర్ ల కస్టడీ పొడిగింపు
ఇండియన్ ముజాహిదిన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ లకు మరోసారి ఎన్ఐఏ కస్డడీని ఢిల్లీ కోర్టు పొడిగించింది. దాంతో, నాలుగు రోజులపాటు, అంటే ఈనెల 21వరకు ఏన్ఐఏ అధికారులు వీరిద్దరినీ విచారించనున్నారు. ఇప్పటివరకు దేశంలోని పలు బాంబు పేలుళ్ల కేసుల్లో 19 రోజుల పాటు అధికారులు వీరిని విచారించారు.