: భారత్-ఎ భంగపాటు


తొలి వన్డే నెగ్గి మాంచి జోరుమీదున్న భారత్-ఎ జట్టుకు భంగపాటు తప్పలేదు. విండీస్-ఎ జట్టుతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య జట్టు 55 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో కెప్టెన్ యువరాజ్ సింగ్ (40), ఉన్ముక్త్ చాంద్ (38), జాదవ్ (35), నమన్ ఓజా (34) ఓ మోస్తరుగా రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడంతో భారత్-ఎ ఇన్నింగ్స్ కుదుపులకు లోనైంది.

చివర్లో షాబాజ్ నదీమ్ (16 బంతుల్లో 21 నాటౌట్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా ప్రయోజనం దక్కలేదు. భారత్-ఎ మరో ఎనిమిది బంతులు మిగిలుండగానే 48.4 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. విండీస్-ఎ బౌలర్లలో కమిన్స్ కు 4, మిల్లర్, కార్టర్ కు చెరో రెండు వికెట్లు దక్కాయి. తొలి వన్డేలో భారత్ నెగ్గగా.. ఈ విజయంతో కరీబియన్ జట్టు మూడు వన్డేల సిరీస్ ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే ఇదే మైదానంలో ఎల్లుండి జరగనుంది.

  • Loading...

More Telugu News