: ఢిల్లీ జేఎన్ యూ విద్యార్ధి ఎన్నికల్లో 'ఐసా' విజయకేతనం


ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్ధి సంఘం (జేఎన్ యూఎస్ యూ) ఎన్నికల్లో వామపక్షానికి చెందిన 'ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్' (ఐసా) విజయదుందుభి మోగించింది. పోటీచేసిన నాలుగు స్థానాల్లోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేసింది. భారీ మెజారిటీతో ప్రత్యర్ధులను ఓడించింది. ఈ నెల 13న (శుక్రవారం) ఉత్కంఠగా ఈ ఎన్నికలు జరిగాయి. శనివారం నుంచి ఓట్లు లెక్కించి నిన్న (సోమవారం) ఫలితాలను అధికారులు ప్రకటించారు. మొత్తం 4,589 ఓట్లు పోలయ్యాయని జేఎన్ యూఎస్ యూ ఎన్నికల కమిషనర్ తెలిపారు. అధ్యక్షుడిగా అక్బర్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా ఏగ్నెస్, ప్రధాన కార్యదర్శగా సౌరవ్ ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News