: అడుగడుగునా కావూరికి సమైక్య సెగ
కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుకు అడుగడుగునా సమైక్య సెగ తగులుతూనే ఉంది. ఈ ఒక్క రోజే పలుమార్లు మంత్రిని అడ్డుకున్న సమైక్యవాదులు తమ నిరసనను గట్టిగానే తెలుపుతున్నారు. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కృష్ణాజిల్లా మండవల్లి మండలం భైరవపట్నంలో పిన్నమనేని కోటేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరైన కావూరిని ఇక్కడా సమైక్యవాదులు అడ్డుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి వారిని నియంత్రించడంతో మంత్రి విగ్రహావిష్కరణ చేశారు.