: రాష్ట్ర విభజనను సీఎం కూడా ఆపలేరు: డీకే అరుణ
రాష్ట్ర విభజన నిర్ణయంతోనే కాంగ్రెస్ పెద్దలకు రోగాలొచ్చాయన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను మంత్రి డీకీ అరుణ తప్పుబట్టారు. రోగాలున్నది మీ నేత చంద్రబాబుకేనని ఆమె ఘాటుగా స్పందించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లు రాష్ట్రంలో కరవుకాటకాలేనని అన్నారు. రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చంద్రబాబు ఇరుప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని... సీఎం ఆపినా తెలంగాణ ఆగదని అరుణ తెలిపారు. అన్ని ప్రాంతాల వారిని సంప్రదించాకే కాంగ్రెస్ తెలంగాణ నిర్ణయం తీసుకుందని... రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నేతలు సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.