: గణేశ్ నిమజ్జనానికి 15వేల మందితో బందోబస్తు: అనురాగ్ శర్మ


హైదరాబాదులో రేపు నిర్వహించబోయే గణేశ్ మహానిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నగర కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇందుకోసం నిమజ్జన కార్యక్రమంలో 15వేల మందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ కు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్న కమిషనర్.. వెయ్యి మంది హెడ్ కానిస్టేబుళ్లు, మరో వెయ్యిమంది హోంగార్డులు ట్రాఫిక్ విధులు చేపడతారని వెల్లడించారు. 32 మందితో బాంబు స్క్వాడ్ ను నియమించామని శర్మ చెప్పారు. 800 వీడియో కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గణేశ్ మంటపాల నిర్వాహకులతో సమావేశమై ఇబ్బందులను తెలుసుకుని ఈ చర్యలు చేపట్టామన్న కమిషనర్, మహానిమజ్జనం సందర్భంగా అత్యంత భద్రత ఉంటుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News