: ఏపీఎన్జీవోల బస్సులపై దాడి కేసులో తొమ్మిది మంది అరెస్ట్
ఏపీఎన్జీవోల బస్సులపై దాడి కేసులో 9మంది అరెస్టయ్యారు. వీరిలో టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుతో పాటు, విద్యార్థి సంఘాల నాయకులు, తెలంగాణ వాదులు ఉన్నారు. ఈనెల 7న 'సేవ్ ఆంధ్రప్రదేశ్' పేరుతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీఎన్జీవోలు నిర్వహించిన బహిరంగ సభకు సీమాంధ్ర ప్రాంతాల నుంచి వేలమంది ఉద్యోగులు హాజరయ్యారు. సభ ముగిసిన అనంతరం తిరిగి వెళుతున్న సమయంలో హయత్ నగర్, అబ్దుల్లా పూర్ మెట్ వద్ద ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సులపై కొంతమంది రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో పలువురు ఏపీఎన్జీవోలు గాయపడ్డారు.