: భారత్-ఎ బౌలర్లను ఆడుకున్న కార్టర్
విండీస్-ఎ జట్టుతో రెండో వన్డేలో భారత్ బౌలర్ల పసలేని బౌలింగ్ ను కరీబియన్ బ్యాట్స్ మన్ జోనాథన్ కార్టర్ ఓ ఆట ఆడుకున్నాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్-ఎ కార్టర్ (133) సూపర్ సెంచరీతో భారీ స్కోరు సాధించింది. కార్టర్ స్కోరులో 18 ఫోర్లు, 3 భారీ సిక్సులున్నాయి. కార్టర్ కు తోడు ఎడ్వర్డ్స్ (36), జాన్సన్ (39) రాణించడంతో విండీస్-ఎ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 279 పరుగులు చేసింది. భారత బౌలర్లలో వినయ్ కుమార్ 3, యూసుఫ్ పఠాన్ 2 వికెట్లు తీశారు.