: అమెరికా కుబేరుల జాబితాలో ముగ్గురు భారతీయులు
అమెరికా శ్రీమంతుల జాబితాలో ముగ్గురు భారతీయులకు స్థానం దక్కింది. యూఎస్ లో అత్యంత ధనవంతులైన 400 మందితో కూడిన జాబితాను ఫోర్బ్స్ మేగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తన అగ్ర స్థానాన్ని మరోసారి పదిలపరచుకున్నారు. 72 బిలియన్ డాలర్ల సంపదతో గేట్స్ వరుసగా 12వ ఏడాది అమెరికా అపర కుబేరుడిగా స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఆయన తర్వాత స్థానాల్లో ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (58.5 బిలియన్ డాలర్లు), ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (41 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
ఫోర్బ్స్ జాబితాలో ముగ్గురు ఎన్నారైలు కూడా చోటు సంపాదించుకున్నారు. వీరిలో ఏఎంపీ అండ్ ఏఎంపీ అధినేత భరత్ దేశాయ్ (2.2 బిలియన్ డాలర్లు) 252వ స్థానంలో నిలిచారు. కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్న రమేశ్ టీ వద్వానీ (2.1 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానంలో ఉన్నారు. కాలిఫోర్నియాలో ఉన్న క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా 1.5 బిలియన్ డాలర్ల సంపదతో 352 వ స్థానంలో నిలిచారు.