: టాలీవుడ్ హీరోల్లో నాగార్జున బాగా నచ్చుతారు: గుత్తా జ్వాల


బ్యాడ్మింటన్ తార గుత్తా జ్వాల సినిమా వాతావరణాన్ని బాగా ఇష్టపడుతోంది. ఆమె వరస చూస్తుంటే, ఇక బ్యాడ్మింటన్ కోర్టులో కన్నా, షూటింగు సెట్లోనే ఎక్కువగా గడిపేలా వుంది. తాజాగా 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో నితిన్ పక్కన ఓ ఐటెం పాటలో నర్తించిన ఈ అందగత్తె, ముందు ముందు కూడా సినిమాలు చేస్తానంటోంది. టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా... తనకి నచ్చితే కనుక ఏ సినిమా అయినా సరే చేస్తానని చెప్పింది. ఐటెం పాటలను తక్కువగా చూడద్దని కూడా కోరుతోంది. కరీనా కపూర్ ఇటీవల చేసిన 'ఫెవికాల్' ఐటెం పాట అందరికీ నచ్చింది కదా? అంటూ ప్రశ్నిస్తోంది.

అయితే, హీరోయిన్ గా నటించడానికి మాత్రం ఒక షరతు పెడుతోంది. అదేమిటంటే, తన పక్కన నటించే హీరో మాత్రం పొడుగ్గా వుండాలని అంటోంది. తెలుగు హీరోల్లో అలా తన పక్కన సూట్ అయ్యే వాళ్ళు నలుగురైదుగురు వుంటారేమో అంది. టాలీవుడ్ లో నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్, నితిన్ నచ్చుతారనీ, అదే హిందీలో అయితే... అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంటే ఇష్టమనీ చెబుతోంది. ఇదిలావుంచితే, మన టాలీవుడ్ హీరోల్లో నాగార్జున తనకి బాగా నచ్చుతారని చెప్పింది. నేటి కుర్ర హీరోల కన్నా కూడా ఆయన తన ఫిజిక్ బాగా మెయిన్ టైన్ చేస్తున్నాడని నాగార్జునకి జ్వాల కితాబు కూడా ఇస్తోంది!

  • Loading...

More Telugu News