: మరోసారి రేణుకను టార్గెట్ చేసిన పొన్నం
ఎంపీ పొన్నం ప్రభాకర్ మరోసారి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని టార్గెట్ చేశారు. రెండ్రోజుల క్రితం హైదరాబాదులో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశంలో రేణుకపై మండిపడిన పొన్నం.. తాజాగా ఆమె అమరవీరులకు క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ, రేణుక గతంలో తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారి పట్ల చులకనగా మాట్లాడారని, అందుకు ఆమె క్షమాపణలు చెప్పాల్సిందేనన్నారు. రేణుక తన వ్యాఖ్యలు వెనక్కితీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.