: సోనియాకు దేశమంతా సమానమే: డీఎస్


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి దేశమంతా సమానమే అని పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. హైదరాబాదు గాంధీ భవన్లో ఆయన నేడు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సోనియా ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదని ఉద్ఘాటించారు. విభజనతో అన్ని ప్రాంతాలకు సమప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ఇంకా ఈ వేడుకల్లో మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ కూడా పాల్గొన్నారు. డీకే అరుణ మాట్లాడుతూ, సీఎం కూడా తెలంగాణను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News