: ఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసులో పదిహేను మంది అరెస్టు


నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కేకే తండాలో కొద్ది రోజుల క్రితం ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్యపై దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములను కబ్జా చేసి, సాగు చేస్తున్నారన్న సమాచారంతో కేకే తండా వెళ్ళిన గంగయ్యపై కొందరు విచక్షణ రహితంగా దాడి చేయడంతో ఆయన అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. ఈ కేసులో పోలీసులు 15 మందిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి 4 ట్రాక్టర్లు, ఒక ఆటో, పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News