: జగన్ కేసులో నేడు చివరి చార్జ్ షీటు
జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కిరానుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ చివరి చార్జ్ షీటును నేడు నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేయనుంది. ఇందులో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల వ్యవహారం, ఇందూ ప్రాజెక్టు, కోల్ కతా కంపెనీలపై అభియోగాలు మోపినట్టు తెలుస్తోంది. కాగా, లేపాక్షి భూముల ఉదంతంలో మంత్రి గీతారెడ్డి పేరు చార్జ్ షీటులో ఉండే అవకాశం ఉంది.