: తెలంగాణ జేఏసీ కార్యాలయంలో విమోచన దినోత్సవం


హైదారాబాదులోని తెలంగాణ పొలిటికల్ జేఏసీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీమాంధ్రపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రాలో తెలంగాణను విలీనం చేయడం వల్లే ఈ ప్రాంత చరిత్ర మరుగున పడిందని విమర్శించారు. దీనికి సీమాంధ్ర నాయకులు, ప్రజలే కారణమని అన్నారు. కేవలం ప్రత్యేక రాష్ట్రంతో మాత్రమే తమ ఆకాంక్షలు నెరవేరతాయని తెలిపారు. 29 న 'సకలజన భేరి'ని నిజాం కాలేజీ గ్రౌండ్ లో నిర్వహిస్తామని... దీనిక సంబంధించిన అనుమతికోసం ఇప్పటికే కమిషనర్ కు లేఖ రాశామని కోదండరాం తెలిపారు. అంతే కాకుండా వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ వాదులందరూ జై గణేశా, జై తెలంగాణ అని నినాదాలు చేయాలని సూచించారు.

మరో జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... నేడు పోలీసు రాజ్యం నడుస్తోందని... ప్రజాస్వామ్య విలువలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. తెలంగాణపై కాలయాపన చేస్తే భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News