: పాల్వంచలో కేటీపీఎస్ కార్మికుల ఆందోళన


ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. 'మానస' స్వచ్ఛంద సంస్థ ఆధ్యర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా కార్మికులు 24 గంటల దీక్షకు కూర్చున్నారు. కేటీపీఎస్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు సీఎస్ ఆర్ పాలసీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల దీక్షకు వివిధ రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఈ దీక్షలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరో దశలో పనిచేసిన నిర్మాణ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News