: హైదరాబాద్ అభివృద్ధి ఘనత టీడీపీదే: చంద్రబాబు
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అభివృద్ధిపథంలోకి తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని చంద్రబాబు అన్నారు. ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తమతోనే ప్రారంభమయ్యాయని చెప్పారు. 'హైదరాబాద్ సంస్థాన విలీన దినం' సందర్భంగా పార్టీ కార్యాలయంలో బాబు మాట్లాడారు. రాజధాని చుట్టుపక్కల భూముల అమ్మకాన్ని టీడీపీ మొదటి నుంచి వ్యతిరేకించిందన్న ఆయన, వైఎస్ భూములు అమ్ముతుంటే తెలంగాణపై ఇప్పుడు మాట్లాడే నేతలు అప్పడేమయ్యారని ప్రశ్నించారు.