: శ్రీవారి పాదాల మంటపంలో రేపు నూతన పాదాల ప్రతిష్ఠ
తిరుమల నారాయణగిరి పర్వతం మీద ఉన్న శ్రీవారి పాదాల మంటపంలో స్వామి వారికి నూతన పాదాలను ప్రతిష్ఠించనున్నారు. ఇంతకుముందున్న పాదాలకు ఇటీవల బొటనవేలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. రేపు ఉదయం 6 గంటలకు పాద ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి శ్రీవారి పాద దర్శనానికి భక్తులను నిలిపివేస్తున్నట్టు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. రేపు పాద ప్రతిష్ఠ జరిగిన అనంతరం యథావిధిగా భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆయన తెలిపారు.