: ఈ హార్మోను కొవ్వును నియంత్రిస్తుంది


పురుషుల్లో ఉండే ఈస్ట్రోజన్‌ అనే హార్మోను కొవ్వును నియంత్రించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాలోని మసాచుసెట్స్‌ ఆసుపత్రి నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

పురుషుల్లో ఉండే టెస్టోస్టెరాన్‌ హార్మోను కొద్ది మోతాదులో ఈస్ట్రోజన్‌గా మారిపోతుంది. ఈవిధంగా మారడానికి అరోమేటేజ్‌ అనే ఎంజైము సహాయకారిగా పనిచేస్తుంది. పురుషుల్లో వయసుతోబాటు వచ్చే శారీరక మార్పులు, శక్తిసామర్ధ్యాలు, లైంగిక చర్య వంటి ఇతర జీవక్రియల్తో ఈ రెండు హార్లోన్లు ప్రముఖ పాత్రను నిర్వహిస్తుంటాయి. అయితే ఈస్ట్రోజన్‌ కొద్ది మోతాదులో ఉన్నా కూడా ఇది ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి 20 నుండి 50 ఏళ్ల వయసున్న పురుషులపై అధ్యయనం సాగించామని, వారిలో ఈ రెండు హార్మోన్లను తగ్గించి చూశామని, కండరాల పరిమాణం, సామర్ధ్యం, సన్నని శరీరానికి టెస్టోస్టెరాన్‌ ఉపయోగపడుతుండగా శరీరంలో కొవ్వు నిల్వలను నియంత్రించడంలో ఈస్ట్రోజన్‌ ముఖ్యపాత్రను పోషిస్తుందని, ఈస్ట్రోజన్‌ లోపించిన వారిలో కొవ్వు శాతం కూడా తగ్గినట్టు తమ పరిశోధనలో తేలిందని వారు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News