: రేపు వెలువడనున్న త్రిపుర ఎన్నికల ఫలితాలు
ఈశాన్య రాష్ట్రం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. రేపు ఉదయం నుంచే లెక్కింపు ప్రారంభం అవుతుంది. మొత్తం 8 జిల్లాల్లోని 17 చోట్ల జరిగే ఓట్ల లెక్కింపు కోసం ఎలక్షన్ కమిషన్ కట్టుదిట్టుమైన భద్రతా చర్యలు చేపట్టినట్టు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అశుతోష్ జిందాల్ తెలిపారు. లెక్కింపు సమయంలో ఎలాంటి అనుమానితులు కేంద్రాల వద్దకు రాకుండా భద్రతను పటిష్టం చేశామని చెప్పారు. ఇందుకోసం సీసీటీవీ కెమెరాలు కూడా ఉపయోగిస్తున్నామన్నారు. ఎలక్షన్ కమిషన్ నియమించిన మైక్రో అబ్జర్వర్ల ఆధ్వర్యంలోనే లెక్కింపు జరుగుతుందని ఎలక్షన్ ఆఫీసర్ వివరించారు. త్రిపుర అసెంబ్లీకి ఈనెల 14న 60 స్థానాలకు పోలింగ్ జరిగి