: గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మికి గూగుల్ నివాళి


ప్రఖ్యాత గాయని, కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి 97వ జయంతి (1916, సెప్టెంబర్ 16 పుట్టినరోజు) సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఘన నివాళులర్పించింది. తబలా, డోలక్, తంబురా మీటుతున్న సుబ్బలక్ష్మి ఫోటోతో ఉన్న డూడుల్ ను గూగుల్ పేజిపై ఆవిష్కరించింది.

1938లో 'సేవసదనం' చిత్రంతో చిత్రరంగంలో ప్రవేశించిన సుబ్బలక్ష్మి కళారంగంలో ఎన్నో సేవలందించారు. సంగీతంలో ఎన్నో కచేరీలు ఇచ్చిన ఆమె, అనంతర కాలంలో ఎంతో పాప్యులారిటీ సంపాదించుకున్నారు. బెంగాలీ, సంస్కృతం, పంజాబీ, తమిళ్, కన్నడ, హిందీ వంటి ఇతర భాషల్లోనూ సంగీత కచేరీలు ఇచ్చి కీర్తి గడించారు. ఆమె సేవలకు గుర్తుగా 98లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో ప్రభుత్వం సన్మానించింది. అంతకంటే ముందు 1974లో రామన్ మెగసెసె అవార్డు పొందారు. ఈ అవార్డు పొందిన తొలి మహిళగా ఆమెకు గుర్తింపు దక్కింది. చివరికి 2004, డిసెంబర్ 11న సుబ్బలక్షి తుదిశ్వాస విడిచారు.

  • Loading...

More Telugu News