: అసహనంతో అభిమాని మొబైల్ విసిరేసిన సల్మాన్


బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి తన అసహనాన్ని బహిరంగంగా ప్రదర్శించాడు. ఓ అభిమాని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివరాల్లోకి వెళితే.. అనారోగ్యంతో ముంబయి లీలావతి ఆసుపత్రిలో ఉన్న ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ ను చూసేందుకు సల్మాన్ వచ్చాడు. తిరిగి బయటకు వస్తున్న సల్లూభాయ్ ను చూసేందుకు ఎప్పటిలాగే బయట అభిమానులు భారీగా గుమికూడారు. మరోవైపు మీడియా ప్రతినిధులు ఉన్నారు. వెంటనే వెళ్లిపోవాలనుకున్న సల్మాన్ కారులో కూర్చున్నాడు. ఈ సమయంలో అభిమానులు కారు వద్దకు వచ్చి తమ మొబైల్ కెమెరాలతో అభిమాన హీరోను క్లిక్కు మనిపిస్తున్నారు. తన అనుమతి లేకుండా ఫోటోలు తీసుకుంటుండటంతో సల్మాన్ చిరాకుపడ్డాడు. వెంటనే కారు విండో తెరిచి మొబైల్ తన చేతికి ఇమ్మంటూ అడిగి తీసుకుని దాన్ని రోడ్డుపై గట్టిగా విసిరేశాడు. ఈ చర్యతో అభిమానితో బాటు, మిగతావారంతా షాక్ కు గురయ్యారు. ఇందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమాని సల్మాన్ చేసింది కరెక్టు కాదన్నాడు.

  • Loading...

More Telugu News