: నిలకడగా నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం
బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నారని ఆయన భార్య సైరాభాను మీడియాకు తెలిపారు. పూర్తిగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 13న దిలీప్ కు కొద్దిగా వైరల్ ఫీవర్ వచ్చిందని, నిన్నరాత్రి కొంచెం అసౌకర్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ముంబయిలోని లీలావతి ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. 14 సంవత్సరాల కిందట దిలీప్ కు హార్ట్ సర్జరీ జరిగిందన్నారు. కాగా, ప్రస్తుతం ఆయన కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పారని ఆసుపత్రి వైద్యులు వివరించారు.