: విజయమ్మ ఆధ్వర్యంలో 'సమైక్య రైతు శంఖారావం'


వైఎస్సార్సీపీ నేత షర్మిల సమైక్య శంఖారావం పేరిట బస్సు యాత్ర చేస్తుండగా, ఆమె తల్లి, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ త్వరలోనే సమైక్య రైతు శంఖారావం నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. షర్మిల యాత్రకు కొనసాగింపుగా విజయమ్మ యాత్ర ఉంటుందని పార్టీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు వేలాదిగా ట్రాక్టర్లతో పాల్గొంటారని చెప్పారు. విభజన వల్ల ఎక్కువగా నష్టపోయేది రైతులేనంటూ, అందుకే రైతులు విజయమ్మ యాత్రలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఉమ్మారెడ్డి పిలుపునిచ్చారు. మరో రెండు రోజుల్లో సమైక్య రైతు శంఖారావం యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News