: ఏసీబీకి చిక్కిన పౌర సరఫరాల అధికారి
అవినీతి నిరోధక శాఖ గాలానికి ప్రతిరోజూ ఏదో ఒక అవినీతి చేప దొరుకుతూనే ఉంది. ఈ రోజు మెదక్ జిల్లా సంగారెడ్డిలో రూ. 1.25 లక్షలు లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ అసిస్టెంట్ మేనేజర్ సత్యనారాయణ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. ఓ ఉద్యోగిని రిలీవ్ చేయడానికి సత్యనారాయణ లంచం డిమాండ్ చేశాడు. హైదరాబాద్ ఎర్రగడ్డలో అతను నివాసముంటున్న ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.