: మంత్రివర్గం నుంచి డీఎల్ ను తొలగించండి: వీరశివారెడ్డి


ఆరోగ్య శాఖ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిపై కమలాపురం ఎమ్మెల్యే వీరశివారెడ్డి మరోసారి మండిపడ్డారు. కడప జిల్లా సహకార ఎన్నికల్లో డీఎల్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని.. వెంటనే ఆయనను మంత్రి వర్గం నుంచి తప్పించాలని వీరశివారెడ్డి డిమాండ్ చేశారు. ఆప్కో చైర్మన్ పదవికి పోటీ చేసిన హనుమంతరావును ఉద్దేశ్య పూర్వకంగా డీఎల్ ఓడించేందుకు ప్రయత్నించారని వీరశివారెడ్డి ఆరోపించారు. 

టీడీపీ అభ్యర్థి గజ్జెల శ్రీనివాస్ తో ఆప్కో ఛైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు చేయించారని ఆయన ఆరోపించారు. డీఎల్ కు సహకరించినందుకు మంత్రి సి రామచంద్రయ్యపై కూడా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News