: సీఎం సీమాంధ్ర జేఏసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు: కోమటిరెడ్డి
సీఎం కిరణ్ వ్యవహారశైలి చూస్తుంటే సీమాంధ్ర ఉద్యమానికి జేఏసీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నట్టుందని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర నేతలు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా విభజనను అడ్డుకోలేరని అన్నారు. టీ మంత్రుల విధానం దొంగలే దొంగ అని అరిచిన చందంగా ఉందని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమబాట పట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణా బిల్లు పెట్టినా సీఎం, మంత్రులు రాష్ట్రం రాకుండా అడ్డుకుంటారని చెప్పారు. కేంద్రం వీలయినంత త్వరగా టీ నోట్ పూర్తిచేసి కేబినెట్ లో చర్చించి తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని కోరారు.