: సీమాంధ్ర దొంగల ఫొటోలు రేషన్ కార్డులపై ముద్రించొద్దు: హరీశ్ రావు
సీఎం కిరణ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రచ్చబండ కార్యక్రమంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తున్న సీమాంధ్ర దొంగల ఫొటోలను రేషన్ కార్డులపై ముద్రించొద్దని హెచ్చరించారు. సీఎం తెలంగాణ పేదలకే కాకుండా సీమాంధ్రలో ఉన్న ఎస్సీఎస్టీ నిరుపేదలకూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రూపాయికే కిలోబియ్యం ఇస్తామని చెబుతున్న సీఎం, రేషన్ కార్డులివ్వకుండా ఆ ఫలాలను పేదలకు దూరం చేస్తున్నారని హరీశ్ దుయ్యబట్టారు. సీఎం కిరణ్ ఢిల్లీకి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాల వల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పిన కిరణ్ ఇప్పుడెందుకు మాట్లాడడంలేదని ఆయన ప్రశ్నించారు.