: ఢిల్లీ చేరుకున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు, కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీ చేరుకున్నారు. తమ సమైక్యవాదాన్ని హైకమాండ్ పెద్దల వద్ద వినిపించేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. విభజన నేపథ్యంలో రాష్ట్రం ఏవిధంగా అట్టుడుకుతోందో వారికి వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా సీమాంధ్ర నేతలు సోనియా, రాహుల్ అపాయింట్ మెంట్ల కోసం యత్నించారు. వారు ముజఫర్ నగర్ లో ఉండటంతో ఈ సాయంత్రానికి వారి అపాయింట్ మెంట్ అభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.