: మార్మోగుతున్న సమైక్యనాదం
సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభంజనం కొనసాగుతోంది. వివిధ రూపాల్లో ప్రజలు తమ నిరసన తెలుపుతున్నారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో లక్షగళ గర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సమైక్యనాదంతో మార్మోగిపోయింది. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇక గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లక్ష జన రణభేరి కార్యక్రమం విజయవంతమైంది. ఈ రణభేరికి పెద్ద ఎత్తున సమైక్యవాదులు తరలివచ్చి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోనూ లక్షగళ గర్జన కార్యక్రమం చేపట్టారు.