: నేడు కాణిపాకం వినాయకునికి రథోత్సవం
కాణిపాకం వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. ఈ ఉత్సవం సందర్భంగా పదాతి దళాలతో పాటు అశ్వాలు, గోవులు, ఒంటెలను సిద్ధం చేసినట్టు ఆయన తెలిపారు. భక్తులకు లడ్డూల కొరత ఏర్పడకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.