: అత్యంత పెద్ద వయస్కురాలిగా జపాన్ బామ్మ రికార్డు
ప్రస్తుత జీవనశైలి ప్రకారం ఓ డెబ్భై ఏళ్లు బతకడమే గొప్ప అనుకుంటుంటే.. అడపాదడపా శతాధిక వృద్ధుల గురించి విని ఔరా అని విస్మయానికి గురవుతుంటాం. అయితే, ఓ జపాన్ బామ్మ సెంచరీ అధిగమించి ఇంకా ఆరోగ్యంగానే ఉందిట. ఆమె పేరు మిసా ఓకాయా.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కురాలిగా ఇప్పుడామె గిన్నిస్ బుక్ రికార్డుల్లోకెక్కింది. ప్రస్తుతం ఆమె వయస్సు 114 ఏళ్లు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండడమే తన ఆరోగ్య రహస్యం అంటోందీ రికార్డు గ్రహీత. మరి మనం కూడా ఓకాయా సూత్రాన్నే పాటిద్దామా!.