: ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి మృతి


ప్రముఖ సినీ నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (93) ఈ రోజు ఉదయం హైదరాబాదు, కొండాపూర్ లోని చండ్ర రాజేశ్వరరావు వృద్ధాశ్రమం లో మరణించారు. ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భద్వాజకు తండ్రి అయిన కృష్ణమూర్తి స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్నారు. లక్షాధికారి, జమీందార్, దత్తపుత్రుడు , రోజులుమారాయి, ధర్మదాత, బంగారుగాజులు, చిన్ననాటి కలలు వంటి ఉత్తమ చిత్రాలు నిర్మించారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చినపాలపర్రు గ్రామంలో ఆయన జన్మించారు. కమ్యూనిస్టు భావజాలం గల కృష్ణమూర్తి ప్రజానాట్యమండలిలో చురుకైన పాత్ర పోషించారు . 2007లో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది.

  • Loading...

More Telugu News