: మిస్ అమెరికా కిరీటం తెలుగమ్మాయి కైవసం
అమెరికాలో నివసిస్తున్న తెలుగమ్మాయి నీనా దావులూరి (24) మిస్ అమెరికా కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 15 మంది సెమీఫైనలిస్టులను అధిగమించి ఆమె ఈ ఘనతను సాధించారు. నీనా స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ. ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చినా, నచ్చకున్నా అలాగే ఉండాలని... కానీ ప్రకృతి పరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందం ఇచ్చే మానసికానందం అన్నింటికన్నా గొప్పదన్న ఆమె సమాధానం ఆమెకు కిరీటాన్ని తెచ్చిపెట్టింది. నీనాకు అమెరికా తరపున ఉపకార వేతనాల రూపంలో 50 వేల డాలర్లు అందనున్నారు. ఈ ఏడాది మిస్ న్యూయార్క్ కిరీటాన్ని కూడా నీనా దావులూరి గెలుచుకుంది.