: సన్ రైజర్స్ సారథిగా శిఖర్ ధావన్


చాంపియన్స్ లీగ్ 20 టోర్నీ క్వాలిఫయింగ్ మ్యాచ్ లలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ శిఖర్ ధావన్ సారథ్యం వహించనున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ కుమార సంగక్కర ఈ టోర్నీలో తన సొంతజట్టు కందురాతా మెరూన్స్ కు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నాడు. దీంతో సన్ రైజర్స్ సారథ్య మార్పు అనివార్యమైంది. కాగా, ఎల్లుండి జరిగే రెండవ క్వాలిఫయింగ్ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు కందురాతా జట్టును ఎదుర్కొంటుంది. మొహాలీ ఈ మ్యాచ్ కు వేదిక.

  • Loading...

More Telugu News