: అధిష్ఠానానికి డీకే అరుణ ఆఫర్
కాంగ్రెస్ అధిష్ఠానానికి మంత్రి డీకే అరుణ బంపర్ ఆఫర్ ప్రకటించారు! వెంటనే తెలంగాణ ప్రక్రియ పూర్తిచేస్తే తెలంగాణ ప్రాంతం నుంచి 15 లోక్ సభ స్థానాలు, 100కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇస్తామని చెప్పారు. ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణకు మద్దతుగా గ్రామగ్రామాన కార్యక్రమాలతో పాటు రాష్ట్రస్థాయిలోనూ సభలు ఏర్పాటు చేయాలని ఆమె పార్టీకి సూచించారు.