: కిరణ్ పై వీహెచ్ ధ్వజం


సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని సీఎం తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. హైదరాబాదు మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం అనంతరం వీహెచ్ మీడియాతో మాట్లాడారు. అధిష్ఠానం నిర్ణయానికి మద్దతివ్వకుండా, సీఎం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సమైక్యాంధ్ర కోసం పోరాడాలని ఏపీఎన్జీవోలకు, మంత్రులకు సూచిస్తోంది ముఖ్యమంత్రేనని వీహెచ్ దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News