: ముజఫర్ నగర్ అల్లర్ల మృతులకు పదిలక్షల పరిహారం
ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్ నేడు అల్లర్లతో అట్టుడికిన ముజఫర్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను కలిసిన ఆయన మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అల్లర్లను అదుపులో పెట్టేందుకు సర్కారుకు అన్ని వర్గాలు సహకరించాలని అఖిలేశ్ విజ్ఞప్తి చేశారు.