: జపాన్ ఇక అణుశక్తి రహిత దేశం
జపాన్ అణుశక్తి రహిత దేశాల జాబితాలో చేరింది. దేశంలో చివరి న్యూక్లియర్ రియాక్టర్ ను జపాన్ నేడు స్విచాఫ్ చేసింది. ఫుకుషిమా అణు రియాక్టర్ వద్ద ప్రమాదం జరిగినప్పటి నుంచి అక్కడి ప్రజల్లో అణుశక్తిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాని షింజో అబె అణుశక్తి వినియోగానికి గట్టి మద్దతుదారు అయినప్పటికీ, ప్రజల్లో తలెత్తిన వ్యతిరేకతకు తలొగ్గాల్సి వచ్చింది.