: ఖైరతాబాద్ వినాయకుడికి సందర్శకుల తాకిడి
హైదరాబాద్ నగరంలో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ వినాయకుడికి సందర్శకుల తాకిడి ఎక్కువైంది. నేడు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున ఖైరతాబాద్ తరలివచ్చారు. దీంతో, ఇక్కడి ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ ఎక్కువగా ఉంది.