: తమిళనాట 'అమ్మ' మినరల్ వాటర్
తమిళనాడులో జయలలిత సర్కారు బలహీన వర్గాల కోసం పలు పథకాలు అమలు చేస్తోంది. అప్పటికే అల్పాదాయ వర్గాల కోసం చెన్నైలో రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయలకు భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చవకగా మినరల్ వాటర్ అందించే పథకాన్ని పురచ్చితలైవి నేడు ప్రారంభించారు. చెన్నై సమీపంలోని గుమ్మిడిపూండి వద్ద రోజుకు 3 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ ను ఆమె ప్రారంభిస్తూ మంత్రి సెంథిల్ బాలాజీ నుంచి తొలి బాటిల్ ను పది రూపాయలిచ్చి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైల్వేల్లో లీటర్ నీళ్ళ బాటిల్ ను రూ.15లకు, ప్రైవేటు కంపెనీలు రూ.20లకు విక్రయిస్తున్నాయని, తాము రూ.10లకే అందిస్తున్నామని చెప్పారు. ఈ వాటర్ బాటిళ్ళను బస్ స్టేషన్లలోనూ, దూరప్రాంతాలకు వెళ్ళే బస్సుల్లోనూ విక్రయిస్తారు.