: వైఎస్సార్సీపీ నేతలు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు: టీజీ


కర్నూలులో న్యాయవాదుల జేఏసీ చేతిలో చేదు అనుభవం చవిచూసిన అనంతరం మంత్రి టీజీ వెంకటేశ్ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే లాభపడాలని ఆశిస్తున్న వైఎస్సార్సీపీ నేతలే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ తోపాటు అన్ని పార్టీలు ఓట్లు, సీట్ల కోసమే ఆయా ప్రాంతాలకు అనుకూలంగా మాట్లాడాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీల అధినేతలందరూ ద్వితీయశ్రేణి నాయకులను నిండా ముంచారని దుయ్యబట్టారు. అందుకే సమైక్యాంధ్ర జేఏసీనే తమ అధిష్ఠానంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ ఉదయం కర్నూలు పట్టణంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన టీజీని న్యాయవాదుల జేఏసీ అడ్డుకుంది. న్యాయవాదులు టీజీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీజీ కారుపై రాళ్ళు, చెప్పులు విసిరారు.

  • Loading...

More Telugu News