: ఆకాంక్ష నెరవేరలేదంటున్న మోడీ


సైనిక్ స్కూల్లో విద్యాభ్యాసం చేయాలన్న ఆకాంక్ష తీరనేలేదని గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కొన్ని పరిస్థితుల కారణంగా అది వీలు పడలేదని తెలిపారు. హర్యానాలోని రేవారీ పట్టణంలో మాజీ సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోడీ తన బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ సైనికులను ఉద్దేశించి ఇంతకుముందెన్నడూ ప్రసంగించలేదని, ఇప్పుడు ప్రధాని అభ్యర్థి హోదాలో ఇక్కడ మాట్లాడడం చాలా సంతోషంగా ఉందన్నారు. దేశం కోసం ప్రాణాలు వదిలిన జవాన్లు అమరులని పేర్కొంటూ, జాతి రక్షణ కోసం సర్వస్వం వదులుకునే సైనికులు త్యాగధనులని కొనియాడారు. అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు.

  • Loading...

More Telugu News