: తెలంగాణలో ఐటీ పదింతల అభివృద్ధి సాధిస్తుంది: కేటీఆర్
రాష్ట్రం విడిపోతే ఐటీ పరిశ్రమ తెలంగాణలో పదింతల అభివృద్ధి సాధిస్తుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో జరిగిన ఐటీ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాదుతో పాటే దేశంలో అనేక ఐటీ హబ్ లు పురోగమించాయని అన్నారు. హైదరాబాదు అంశంపై దుష్ప్రచారం చేస్తున్న రాయపాటి, లగడపాటి, మేకపాటి వీరందరూ పచ్చి అవకాశవాదులని కేటీఆర్ మండిపడ్డారు.